రైడర్స్.. విన్నర్స్

SMTV Desk 2018-04-30 11:59:50  rcb loss, kkr win, chris lynn, ipl, kohli

బెంగుళూరు, ఏప్రిల్ 30 : సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) జట్టు ఓటమి పాలయ్యింది. ఐపీఎల్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్.. కోహ్లి జట్టు పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టులో కెప్టెన్ కోహ్లి (68 నాటౌట్‌) ఆదరగోట్టగా, బ్రెండన్‌ మెకల్లమ్‌(38), డీకాక్‌(29‌) పర్వాలేదనిపించారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన రైడర్స్ జట్టులో క్రిస్‌ లిన్‌(62 నాటౌట్‌), రాబిన్‌ ఉతప్ప(36), సునీల్‌ నరైన్‌(27), దినేశ్‌ కార్తీక్‌(23) రాణించారు. దీంతో ఆ జట్టు ఆర్సీబీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 19.1 ఓవర్లలో ఛేదించింది. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ రాయల్ ఛాలెంజర్స్ కొంపముంచాయి. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు క్రిస్ లీన్ కు దక్కింది.