ఆ నటుడిపై ఘాటుగా స్పందించిన నటి తులసి

SMTV Desk 2017-07-06 16:48:38  shankarabaranam, actress, tulasi, actor, shivaji raja,

హైదరాబాద్, జూలై 06 : తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న "మా" అధ్యక్షుడు శివాజీరాజాను ఒక జోకర్ గా అభివర్ణించారు సీనియర్ నటి తులసి. ‘శంకరాభరణం’ సినిమాతో తెలుగువారికి ఆత్మీయురాలిగా మారిన సీనియర్‌ నటి తులసి, "శంకరాభరణం" పేరిట ప్రతీ సంవత్సరం ఉత్తమ నటన కనబరచిన వారికి అవార్డులు అందజేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఆ వేడుక నిర్వహించి ఎన్టీఆర్ తో పాటు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించారు. కాని ఆ వేడుకకు వారెవరూ హాజరుకాలేదు. వారు రాకపోవడానికి కారణం "మా" అధ్యక్షుడు శివాజీరాజాయేనని తులసి ఆరోపించారు. అతడు తన అధికారాన్ని తప్పుడు దారిలో వినియోగిస్తూ, వేరే వ్యక్తులతో కలిసి నా అవార్డుల వేడుకకు అతిధులను రాకుండా అడ్డుకుంటున్నారని ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచారు.