మళ్లీ బంతితో మెరిసిన సన్ రైజర్స్..

SMTV Desk 2018-04-30 11:38:16  sun risers hyderabad, rajastan royals, ipl, kane williamson

జైపూర్, ఏప్రిల్ 30 : ఐపీఎల్ టోర్నీలో సన్ రైజర్స్ హవా కొనసాగుతుంది. బౌలింగ్ ప్రధానాస్త్రంగా ముందుకు సాగుతున్న ఈ జట్టు మరో సారి బంతితో మెరిసింది. జైపూర్ వేదికగా ఆదివారం హైదరాబాద్ జట్టు 11 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటింగ్ లోసారథి కేన్‌ విలియమ్సన్‌ (63), అలెక్స్ హేల్స్ (45) రాణించడంతో.. రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ ప్రత్యర్ధి బౌలింగ్ కు తలవంచింది. ఒక దశలో గెలుపు వైపు అడుగులేసిన రాయల్స్ జట్టును హైదరాబాద్ బౌలర్లు తమ బౌలింగ్ తో కట్టడి చేశారు. కెప్టెన్ రహనే (65, నాటౌట్) సంజు శామ్సన్ (40) ఆడిన జట్టుని గెలిపించాలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 140 చేసి ఓటమి పాలయ్యింది. సందీప్‌ శర్మ (1/15), సిద్ధార్థ్‌ కౌల్‌ (2/23), రషీద్‌ ఖాన్‌ (1/31) హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు. విలియమ్సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.