మెదడు..నిజాలు

SMTV Desk 2018-04-29 17:48:26  brain its facts, human brain, human part brain, hyderabad

హైదరాబాద్, ఏప్రిల్ 28 : సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మెదడుకు సంబంధించిన విషయాలు ఇంకా మీస్టరీగానే ఉన్నాయి. మెదడు గురించి మనం తెలుసుకున్నది చాలా తక్కువనే చెప్పాలి. మెదడు గురించిన వివరాలు అనగానే ఇప్పటికే ఆసక్తికరంగా అనిపిస్తుంది. >> ఆవలింత మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ పంపుతుంది. దీని వల్ల మెదడు చురుకుగానూ, శాంతంగానూ అవుతుంది. >> ఐదు సంవత్సరాలోపు పిల్లలు రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలు నేర్చుకొంటే వారి మెదడు నిర్మాణ క్రమం పెద్దవారి మెదడులా మారుతుంది. >> మెలుకువగా ఉన్నప్పుడు మెదడు 10 నుండి 23 వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి ఒక లైట్ వెలిగించడానికి సరిపడా ఉంటుంది. >> మన శరీరభాగాలన్నిటిలో మెదడు ఎక్కువ కొవ్వు కలిగిన అవయవం. మెదడులో 60 శాతం కొవ్వు ఉంటుంది. >> పిల్లలు సంగీతం నేర్చుకుంటే అది మెదడు ఆలోచన శక్తిని పెంచుతుంది. మెదడులో సమాచారం గంటకు 268 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఆల్కహాల్ సేవించినప్పుడు ఈ వేగం తగ్గుతుంది. >> మనిషికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత మెదడు పెరుగుదల ఆగిపోతుంది. మనిషి బరువులో 2 శాతం బరువు మాత్రమే కలిగిన మెదడు తినే ఆహారం నుండి మాత్రం 30 శాతం శక్తిని తీసుకుంటుంది.