మైనర్ బాలుడిపై లైంగిక దాడి ?!

SMTV Desk 2017-07-06 16:40:29  sexual harrassment, boy, old city

హైదరాబాద్, జూలై 06 : పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది. చాంద్రాయణ గుట్ట, బార్కాస్ కు చెందిన 10 ఏళ్ల బాలుడిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి చేసి తరువాత ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆ బాలుడిని హతమార్చిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం, నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా నిర్గాంత పోయే అంశాలు వెల్లడయ్యాయి. మహ్మద్ ఖాన్ అనే అబ్బాయి గత నెల 29న కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసారు. అనంతరం అతణ్ణి విచారించగా హత్య చేసి మృత దేహాన్ని వాటర్ ట్యాంక్ లో పడేసాడని భయంతో అంగీకరించాడు. ఇంతటి దారుణానికి ఒడి గట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు మృతుని తల్లితండ్రులు.