రజనీకాంత్‌ తదుపరి తమిళనాడు సీఎం!

SMTV Desk 2018-04-29 17:04:42  charuhasan comments on rajni kanth, rajni kanth, kollywood, kamalahasan

చెన్నై, ఏప్రిల్ 29: ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ సోదరుడు చారుహాసన్‌ తమిళనాడుకు కాబోయే తదుపరి సీఎం సూపర్ స్టార్ రజనీకాంత్‌ అని జోస్యం చెప్పారు. మొదటినుంచి రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశానికి మద్దతుగా మాట్లాడుతున్న ఆయన.. తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. రజనీని కన్నడ వ్యక్తిగా వ్యతిరేకిస్తున్న వారందరికీ ఆయన తన విజయంతో సమధానం చెబుతాడని అన్నారు. రజినీతో పొల్చితే తన సోదరుడు కమల్‌కు సీఎం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని.. ప్రజలు కమల్‌ని సినిమాలో ఆదరించినంతగా రాజకీయాల్లో ఆదరించకపోవచ్చని వ్యాఖ్యానించారు.