పది ఫలితాల్లో బాలికలదే పై చేయి

SMTV Desk 2018-04-29 16:50:29  Andhrapradesh, tenth results, Release, minister ganta srinivasa rao

విశాఖపట్నం, ఏప్రిల్ 29 : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌ హాలులో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 17వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 94.48 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 94.56 శాతం, బాలురులు 94.41 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో ప్రకాశం జిల్లా 97.93 శాతం ఉత్తీరతతో మొదటి స్థానంలో నిలివగా, నెల్లూరు జిల్లా 80.37 శాతం ఉత్తీర్ణతో చివరి స్థానంలో నిలిచింది. ఈసారి కూడా బాలికలదే పైచేయి కావడం విశేషం.