ఒత్తిడిని ఇలా చిత్తు చేయండి

SMTV Desk 2018-04-29 15:58:27  depression tips, mental depression, hyderabad, yoga tips

హైదరాబాద్, ఏప్రిల్ 29 : ప్రస్తుత కాలంలో మానసిక ఒత్తిడి నుండి తప్పించుకోలేం. ఎదో ఒక రూపంలో అది జీవితంలో భాగం అయిపొయింది. తప్పించుకోవడానికిచూడడం కంటే దాన్ని సరైన విధానంలో ఎదుర్కోవడమే మంచి పద్ధతి. మానసిక ఒత్తిడిలో ఉన్నామని అనుకోవడం మొదలుపెడితే అది మరింత బాధిస్తుంది. అలా అనుకోవడం కంటే ఎలా ఎదుర్కోవాలో దారులు వెతుక్కోవడం మంచిది. >> క్రమం తప్పని వ్యాయామం : *జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో గడపడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రలేవడం, ఒక సమయానికి నిద్రపోవడం అలవరుచుకోవడం మంచిది. నిద్ర లేవగానే చేసేందుకు వీలుగా కొన్ని స్త్రేచింగ్స్, ధ్యానం వంటివి తప్పనిసరిగా చేసుకోవాలి. వాకింగ్ అలవాటు ఉంటే మరి మంచిది. >> శ్వాస మీద కాస్త ధాస్య: *రోజు ఉదయం కనీసం 15 నిముషాలు పాటు ప్రాణాయామం చెయ్యడం ద్వారా రోజంతా తాజాగా ఉండొచ్చు. అందువల్ల మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ చేరడం వల్ల చురుకుగా ఉంటుంది. ఒత్తిడి ఎదురైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది. >> ఆహారం : *మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువ తినేస్తుంటారు. చాలా మంది ఇది మరింత ఒత్తిడికి హేతువు. కనుక ఆహారం మీద శ్రద్ధ తప్పనిసరి. ఎక్కువ తినడం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. తీసుకుంటున్న ఆహారం సమతుల ఆహారం అయి ఉండాలి.