తమన్నానే మించిపోయిన చైనా సుందరి కాపీయింగ్

SMTV Desk 2017-07-06 16:24:33  actress,tamanna, 100 parcent love, film, in copy, china

బీజింగ్ జూలై 6 : సినిమాలు మనుషులను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే, అదే మాదిరిగా బయట కూడా జీవించడానికి ఇష్టపడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా యువతపై ఆ ప్రభావం ఇంకా ఎక్కువనే చెప్పొచ్చు. 100% లవ్ లో తమన్నాని మరోసారి గుర్తుచేసిందో అమ్మాయి. వివరాల్లోకి వెళితే, చైనాకి చెందిన ఓ యువతి మాస్ కాపీయింగ్‌కు పాల్పడింది. ఏకంగా తన కాలునే చిట్టీగా ఉపయోగించుకుంది. చైనాలో ప్రతి సంవత్సరం జూలై నెలలో ఫైనల్ పరీక్షల సీజన్ నడుస్తుంది. దీంతో ఓ అమ్మాయి ఇలా తన కాలిపై రాసుకొని వెళ్లిందట. పై నుండి ఎలాగు డ్రెస్ ఉంటుంది కాబట్టి ఎవరికి కనిపించదని ఈ భామ నమ్మకం. ఆమె స్నేహితురాలు ఒకరు సరదాగా తీసిన ఫోటోలు, వెబివో వెబ్‌సైట్లో పోస్టుచేయడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ విద్యార్థిని అకౌంటింగ్ పరీక్షల కోసం చిట్టీ రాసుకెళ్లినట్టు కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మడు మాస్ కాపీ చేస్తూ పట్టుబడిందా లేదా అన్నది మాత్రం తెలియరాలేదు.