చెన్నైకు షాక్..

SMTV Desk 2018-04-29 13:12:53  deepak chahar, csk player chahar injured, ipl, mumbai indians

పుణె, ఏప్రిల్ 29 : వరుస విజయాలతో ఊపుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ముంబై ఇండియన్స్‌ జట్టు ఓటమి రుచి చూపించింది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైకి ముంబయిపై ఓటమితో పాటు మరో షాక్‌ తగిలింది. ఇప్పుడు ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే చెన్నై బౌలింగ్‌ విభాగంలో కాస్త బలహీనంగా కనిపిస్తోంది.‌ ఈ క్రమంలో కాస్త నమ్మకంగా కనిపిస్తున్న పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహార్‌ కూడా గాయం కారణంగా రెండు వారాలపాటు జట్టుకు దూరమైనట్లు ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపాడు. ముంబయిపై మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో బంతి అందుకున్న చాహార్‌ కట్టుదిట్టంగా బంతులు విసిరాడు. అయితే తిరిగి ఐదో ఓవర్‌లో బంతి అందుకున్న అతను‌ తొలి బంతి విసరగానే గాయంతో బాధపడుతూ మైదానం నుండి వైదొలిగాడు. ఈ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ.."ఇంతకుముందే చాహార్‌ కాలి కండరాలు నొప్పితో కాస్త ఇబ్బంది పడ్డాడు. ముంబయితో మ్యాచ్‌లో అది తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీంతో కొన్ని వారాలపాటు అతను విశ్రాంతి తీసుకుంటాడు" అని వ్యాఖ్యానించాడు. చాహార్‌ జట్టుకు దూరం కావడంతో లుంగి ఎంగిడి జట్టులో చేరతాడని ఫ్లెమింగ్‌ చెప్పాడు.