చంద్రబాబుది దగా పోరాట౦: రోజా

SMTV Desk 2018-04-29 12:44:43  Special Category Status chandra babu YSRCP TDP

విజయవాడ, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష చేస్తాననడంపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసంమంటూ చంద్రబాబు చేస్తోన్నది దగా పోరాటమని ఆమె ఆరోపించారు. ధర్మ పోరాట దీక్ష పేరిట తిరుపతిలో చంద్రబాబు రేపు తలపెట్టిన సభపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. నియోజక వర్గాల పెంపు కోసం ప్రత్యేక హాదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది చంద్రబాబేనని రోజా ఆరోపించారు. ఎన్డీయే భాగస్వాములుగా నాలుగేళ్లు కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్న తెదేపా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.