ఇక నుండి పేటీఎంలో ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌

SMTV Desk 2018-04-28 16:22:38  paytm, paytm tap card, paytm app, pos

ఢిల్లీ, ఏప్రిల్ 28 : పేటీఎం.. నగదు రహిత లావాదేవీలు క్రమంగా పెరిగినప్పటి నుండి దీని వాడకం పెరిగిపోయింది. తాజాగా మొబైల్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌ యాప్‌ పేటీఎం ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ను ప్రవేశపెట్టింది. ‘టాప్‌ కార్డ్‌’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆప్షన్‌తో క్షణాల్లో డబ్బు బదిలీ చేసుకోవచ్చు. దేశంలో ఇది మొదటి ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ సొల్యూషన్‌. ఈ టాప్ కార్డ్‌ ఎన్‌ఎఫ్‌సీ (నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌) ఉపయోగించుకుని కంపెనీ గుర్తించిన పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) టర్మినల్‌కు నగదు బదిలీ చేస్తుంది. ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండా ఈ బదిలీ చేయొచ్చు. ట్యాప్‌ కార్డును వాడుతూ వెనువెంటనే డిజిటల్‌ పేమెంట్లు జరుపడం కోసం పేటీఎం ప్రస్తుతం ఈవెంట్లు, ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్లు, కార్పొరేట్లతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటోంది. పేమెంట్‌ను జరుపడానికి మెర్చంట్‌ టర్మినల్‌ వద్ద కస్టమర్‌ కార్డును ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది. ఫోన్లను పట్టుకెళ్లకుండానే ఈ లావాదేవీలు జరుపుకోవచ్చు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడానికి తాము కృషిచేస్తున్నామని, చాలా మందికి ఇంటర్నెట్‌ యాక్సస్‌ లేదని, దీంతో పాటు కొందరు ఆన్‌లైన్‌ పేమెంట్లు జరుపడానికి వెనుక అడుగు వేస్తున్నారని పేటీఎం సీఓఓ కిరణ్‌ వాసి రెడ్డి తెలిపారు.