కన్నడ నాట సమరంకు 2655 మంది

SMTV Desk 2018-04-28 13:22:02  karnataka elections, karnataka elections 2018, bjp, congress

బెంగళూరు, ఏప్రిల్ 28 : కర్ణాటక ఎన్నికల సమరం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడిక్కుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రచారంలో వేగం పెంచారు. కాగా ఈ సారి ఎన్నికల్లో మొత్తం 2,655 మంది బరిలోకి దిగారు. వీరిలో 219 మంది మహిళలున్నారు. ఏప్రిల్‌ 24 బుధవారంతో నామినేషన్లు వేసేందుకు గడువు ముగిసింది. మొత్తం 3,509 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన అధికారులు 271 మంది నామినేషన్లను తిరస్కరించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన ఏప్రిల్‌ 27 శుక్రవారం 583 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో మొత్తం 2,655 మంది బరిలో నిలిచారు. కర్ణాటకలో మొత్తం 224 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వీటన్నింటికీ ఒకే దశలో మే 12న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 15న ఫలితాలు వెల్లడిస్తారు.