ఐపీఎల్ లో రాజ్‌పుత్‌ సరికొత్త రికార్డు

SMTV Desk 2018-04-27 17:25:25  Ankit Rajpoot, kings x1 punjab, ipl, srh

హైదరాబాద్, ఏప్రిల్ 27 : కింగ్స్ X1 పంజాబ్ జట్టు లో యువ బౌలర్ అంకిత్‌ రాజ్‌పుత్‌ సరికొత్త రికార్డు లిఖించాడు. గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఈ యువ ఆటగాడు (5/14) ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే ఐదు వికెట్లు సాధించిన తొలి భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. రాజ్‌పుత్‌ బౌలింగ్ దెబ్బకు సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసింది. అంతేగాకుండా ఐదు వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇంతకు ముందు ఇషాంత్‌ శర్మ (5/11) ఐపీఎల్‌ 2011 సీజన్‌లో తొలి సారి ఈ ఘనత నమోదు చేశాడు. దీంతో ఇప్పటి వరకు అత్యత్తుమ ప్రదర్శన జాబితాలో తొలి స్థానంలో ఉన్న ముంబై ఆటగాడు మయాంక్ మార్కండే (4/23)ను రాజ్‌పుత్‌ తాజా ప్రదర్శనతో అధిగమించాడు. రాజ్‌పుత్‌ రాణించిన పంజాబ్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల దాటికి కింగ్స్ X1 జట్టు 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.