కేఎల్‌ వికెట్ ఎంతో ప్రత్యేకం : రషీద్‌ ఖాన్‌

SMTV Desk 2018-04-27 16:53:57  rasshid khan, srh rashid khan, kl rahul, ipl

హైదరాబాద్‌, ఏప్రిల్ 27 : ఐపీఎల్‌లో సన్ రైజర్స్ జట్టు తక్కువ పరుగులు చేసిన కూడా విజయాలు సాధిస్తుంది. ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో ఉన్న ఎనిమిది జట్లలో హైదరాబాద్ జట్టుకు బలం బౌలింగ్. బౌలర్లనే ప్రధాన అస్త్రంగా మార్చుకుని విజయాలతో ముందుకు వెళ్తోంది. ఆ జట్టు ప్రధాన బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ కూడా ఒకడు. గురువారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన రషీద్‌ (3/19)తో స్వల్ప స్కోర్‌ను కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌ తర్వాత రషీద్‌ ఖాన్‌ మాట్లాడుతూ..."కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ నాకు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. అతనో క్లాస్‌ ఆటగాడు అంతే కాదు. నా అభిమాన ఆటగాళ్లలో రాహుల్‌ కూడా ఒకడు. జట్టు తక్కువ స్కోర్‌ చేసినప్పుడు లెంగ్త్‌ సరిగా చూసుకుని వికెట్‌ టు వికెట్‌ బంతులేయాలన్నది నా ప్రణాళిక. అలా చేస్తేనే మా జట్టు తక్కువ స్కోర్‌ చేసిన ప్రత్యర్థి జట్టు దాన్ని ఛేదించకుండా చేయగలం. గత రెండు మ్యాచ్‌ల్లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. కానీ, బ్యాట్స్‌మెన్‌ మరిన్ని పరుగులు చేయాలి" అని రషీద్‌ఖాన్‌ వ్యాఖ్యానించాడు.