ఎక్కువగా బానిసలవుతుంది మైనర్ లె!!!

SMTV Desk 2017-07-06 14:34:42  drugs, hyderabad, minors

హైదరాబాద్, జూలై 06 : ఇది డిజిటల్ యుగం. రెండో తరగతి మూడో తరగతి నుండే ఎడ్యుకేషన్ లో కంప్యూటర్ భాగమైపోతుంది. అలాంటప్పుడు టీనేజర్స్ కి స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోతే ఎలా? నిజమే అది అవసరమే! కాని ఆ అవసరం హద్దు మీరితే అనేక వ్యసనాలకి షార్ట్ కట్ అవుతుంది. మీ పిల్లలు నిండా మునిగిపోయారని మీకు తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆధునిక టెక్నాలజీ, ఫన్ ఇలా అనేక రూపాల్లో కొత్త కొత్త వ్యసనాలు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో మొదటిది స్మార్ట్ ఫోన్. మోడ్రన్ టెక్నాలజీ ఆవిష్కరించిన అధ్బుతాల్లో స్మార్ట్ ఫోన్ ఒకటి. అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చేసింది. అందరి జీవితాల్లో భాగమైపోయింది. కాని అవసరానికి మించి స్మార్ట్ ఫోన్ వాడితే వ్యసనమే. అది కాస్త ఇంటర్నెట్ లో మునిగి తేలడం వరకే పరిమితం కాదు, జీవితాలనే నాశనం చేసేస్తోంది. టీనెజ్ - ఇదో డేంజరస్ ఏజ్. జీవితం లో పైకి ఎదగాలన్న, పతనం అవ్వాలన్న, టీనెజ్ లో సాగే పయనమే అత్యంత ముఖ్యమైనది. మరి టీనేజ్ లో ఉన్న మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనే అంశంపై తల్లిదండ్రులు ఎప్పుడైనా దృష్టి పెట్టారా? ఇటీవలే, హైదరాబాద్ లో డ్రగ్స్ గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నప్పుడు అందులో ఎక్కువ మంది ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు ఉండటం నమ్మలేని నిజం. మీకు తెలుసా...? 1. స్మార్ట్ ఫోన్ అందులో ఇంటర్నెట్, 2. నెమ్మదిగా పోర్న్ వీడియోస్ చూడటం అలవాటు అవుతుంది, 3. ఆ తరువాత హుక్కా ఆ పై పబ్ ఆక్కడి నుండి ఆల్కహాల్, 4. పరిస్థితి చేయి జారే వేళ మాదక ద్రవ్యాలకు బానిస అయిన వేళ డబ్బుల కోసం అడ్డ దారులు తొక్కడం, 5. సైకో గా మారి నేరాలకు పాల్పడటం చివరకు దారుణమైన స్థితిలో పతనం అవ్వడం. ఈ పతనానికి స్మార్ట్ ఫోనే వేదిక అని మనకి తెలిసే లోపె పిల్లల జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఒక్కసారి స్మార్ట్ ఫోన్ ను చెడు దృష్టి తో వాడడం మొదలుపెట్టినప్పటి నుండి అది అలా కొనసాగుతూనే ఉంటుంది. పరిమితికి మించి వాడితే పాడయిపోవడం అతి తేలిక. నిపుణుల సలహా: # పేరెంటల్ కంట్రోల్ కి సంబంధించి థర్డ్ పార్టీ DNSO సర్వర్స్ అందుబాటులో ఉంటాయని, వాటిని మన ఎలక్ట్రిక్ పరికరాల్లో ఇన్ స్టాల్ చేస్తే అది వెంటనే అశ్లీలమైన కంటెంట్ ని బ్లాక్ చేస్తుంది. యాంటీ-పోర్న్ లాంటివి కూడా ఇందుకు ఉపయోగపడతాయి. ఇలాంటివి వాడటం వలన ఎప్పటికప్పుడు సమాచారం పొందవచ్చు. పదేళ్ళ క్రితం : # దశాబ్ద కాలం క్రితం టీనేజర్స్ సరదాలంటే, ఇంట్లో తెలియకుండా సినిమాకి వెళ్ళడం లేదా స్కూల్ ఎగ్గొట్టి వీడియో గేమ్స్ ఆడటం. కాని ఇప్పుడు టీనేజర్స్ సరదాలన్నీ వ్యసనాలుగా మారుతున్నాయి. ఆ వ్యసనాలకి అలవాటు పడిన పిల్లలు ఇంట్లో తెలియకుండా దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. ప్రస్తుతం: # పిల్లల ఆరోగ్యం పూర్తయినప్పుడు లేదా ఏ క్రైమ్ లోనో వాళ్ళు ఇరుక్కున్నప్పుడు అసలు విషయం వెలుగు చూస్తుంది. ఇంటర్నెట్ నుండి ప్రచార సాధనాలు చుట్టూ ఉన్న వాతావరణం ఇవన్నీ పిల్లలకి వయస్సుకి మించిన ఎక్స్ పోసర్ ని ఇస్తున్నాయి. అదే సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం తప్పు కాదన్న భావన వారిలో పెరిగి పోతుంది. అలాగే ఇంటర్నెట్ లో ఆల్కహాల్ నుండి డ్రగ్స్ దాకా సమస్త సమాచారం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకపోతె పిల్లలు అప్ డేట్ కాలేరు... కాని ఇంటర్నెట్ లో ఉన్నదంతా అప్ డేట్ అయితే ఇంకంతె సంగతులు. ఏది మంచి ఏది చెడో తల్లిదండ్రులే వారికి అర్థం అయ్యేలా చెప్పాలి. అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత వారిపై ఉందని కౌన్సిలర్స్ అంటున్నారు.