కోహ్లికి రూ.12లక్షల జరిమానా

SMTV Desk 2018-04-26 14:08:41  virat kohli fine, rcb virat kohli, ipl, chennai super kings

బెంగళూరు, ఏప్రిల్ 26 : రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి జరిమానా పడింది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ‘ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్‌ ఓవర్‌ రేట్‌‌ నియమావళిని అతిక్రమించింది. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి. ఈ కారణంగానే ఆ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని ఐపీఎల్‌ నిర్వాహకులు మీడియాకు లేఖ విడుదల చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు సఫారీ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్‌ (68), డికాక్‌(53) మెరుపులు మెరిపించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన చెన్నై జట్టులో చెన్నై సారథి ధోని (70 నాటౌట్‌), రాయుడు(82)వీరోచిత ఇన్నింగ్స్‌లతో చెన్నైకు విజయాన్ని అందించారు.