భార్య మృతదేహంతో అన్ని సంవత్సరాలా??

SMTV Desk 2017-07-06 14:09:43  women, death, in, 8, years, steel, frij

ఫ్లోరిడా, జూలై 6 : ప్రభుత్వం అందించే ఉచిత పథకాల లబ్ధిని పొందడానికి అనేకమంది దొడ్డిదారులు వెతుకుతున్నారు. తప్పుడు వివరాలను చూపించి అర్హత లేకపోయినా ఎన్నో ప్రయోజనాలను పొందుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. నకిలీ ఆధారాలను సృష్టించేది కొందరైతే, అవినీతి అధికారుల సహాయంతో ప్రభుత్వ ఆశయానికి ఎసరుపెడుతున్న వారు మరి కొందరు ఉన్నారు. వివరాలలోకి వెళితే అలెన్ డన్స్ అనే ఓ వ్యక్తి ఊహించని విధంగా ప్రభుత్వాన్నే మోసం చేశాడు. ప్రభుత్వ లబ్ది పొందేందుకు తన భార్య చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి, బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. భార్య బ్రతికే ఉందని అందరిని నమ్మించి 8 సంవత్సరాలపాటు మృతదేహాన్ని ఫ్రీజులోనే దాచిపెట్టాడు. కాగా అలెన్ డన్స్ భార్య 2002లో చనిపోగా, 2010లో అలెన్ కూడా చనిపోవడంతో ఇద్దరి మృతదేహాలను గుర్తించిన అధికారులు బిత్తరపోయారు. అలెన్ చనిపోయేంతవరకూ దాదాపుగా రూ.10 లక్షల వరకు ప్రభుత్వ లబ్ధిని పొందాడని అధికారులు గుర్తించారు. కాని ఈ విషయం గురించి అతడి వారసులకు కూడా తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. పెద్ద మొత్తంలో అక్రమం జరగడంతో చట్ట ప్రకారం అతని ఇంటిని అమ్మేసి కోల్పొయిన ఆదాయాన్ని తిరిగి సమకూర్చుకోనున్నామని యూఎస్ అటార్నీస్ కార్యాలయ అధికారులు మీడియాకు తెలిపారు.