పోస్ట్ ల భర్తీకి ప్రభుత్వం ఆమోదం

SMTV Desk 2018-04-25 18:28:47   TSPSC, Medical, health, requirement

హైదరాబాద్, ఏప్రిల్ 25‌: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. వైద్యారోగ్యశాఖలో 432 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 108 పోస్టులు, స్టాఫ్‌ నర్స్ 216 పోస్టులు, ఫార్మాసిస్ట్ (గ్రేడ్-2) 54 పోస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ 54 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులన్నీ టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని స్పష్టంచేసింది