ఢిల్లీ సారథిగా శ్రేయస్ అయ్యర్..

SMTV Desk 2018-04-25 16:39:12  Shreyas Iyer, gautham gambhir, delhi dare devils, ipl

ఢిల్లీ, ఏప్రిల్ 25 : ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సారథ్య బాధ్యతల నుండి గౌతం గంభీర్ తప్పుకున్నాడు. ఐపీఎల్ -11 సీజన్ ఆరంభమయ్యే నాటి నుండి ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ జట్టు ఒక్క మ్యాచ్ లో గెలుపొంది.. ఐదు మ్యాచ్ ల్లో అపజయం పాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. దీంతో సారథి గంభీర్‌.. జట్టు ఓటములకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గంభీర్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ నాయకత్వ పగ్గాలు చేపట్టాడు. లీగ్ లో భాగంగ తన తదుపరి మ్యాచ్ ను ఢిల్లీ జట్టు ఈ నెల 27న కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. జనవరిలో నిర్వహించిన వేలంలో గంభీర్‌ను రూ.2.8 కోట్లకు దిల్లీ డేర్‌డెవిల్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.