సన్‌రైజర్స్‌ కు షాక్..

SMTV Desk 2018-04-25 15:09:34  stanlake, stanlake srh, srh, ipl

ముంబై, ఏప్రిల్ 25 : సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు షాక్. టాంపరింగ్ వివాదంతో వార్నర్ దూరం కావడంతో జట్టు ఒకింత ఆందోళన పడింది. లీగ్ ప్రారంభమయ్యాక బాగానే రాణిస్తున్నహైదరాబాద్ జట్టుకు ఇప్పుడు గాయాల బెడద వెంటాడుతుంది. ఇప్పటికే జట్టు సీనియర్‌ ఆటగాళ్లంతా గాయాలతో ఇబ్బంది పడ్తుంటే.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ బిల్లీ స్టాన్‌లేక్‌ గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వేలు విరగడంతో స్టాన్‌లేక్‌ టోర్నీకి దూరమవుతున్నాడని, అతను త్వరంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. సన్‌రైజర్స్‌ ట్వీట్‌ చేసింది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్టాన్‌ లేక్‌ 5 వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.