విమానంలో మహిళపై లైంగిక దాడి

SMTV Desk 2017-07-06 13:58:33  airplane, girl, rape,

ముంబై, జూలై 07 : ఈ మధ్యకాలంలో మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఇలాంటి సంఘటనే ఒకటి దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ఓ మహిళ ఇండిగో 6ఈ 843 విమానంలో కిటికీ పక్క సీటులో కూర్చుంది. తన వెనుక సీట్లలో కూర్చున్న మోమిన్ అర్షద్ హుసేన్, ఫైజాన్ అంజూమ్ మహమ్మద్ ఫారూఖ్ లు ముందు సీట్లో ఉన్న మహిళా ప్రయాణికురాలిని తరచూ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించారు. మహిళా పిర్యాదు ఇచ్చిన మేరకు విమానంలోని క్రూ సిబ్బంది విమానాశ్రయ అధికారులకి విషయాన్ని తెలియపరిచారు. విమానం ముంబైలో సాయంత్రం 6.35 గంటలకు ల్యాండ్ కాగానే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది నిందితులని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 354, 34 ల కింద కేసు నమోదు చేశారు. గత నెల 19 న సీనియర్ మహిళ న్యాయవాదిని తాకరాని చోట్ల తాకి అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ప్రభుద్దుడు. అదే నెల 27 న బెంగళూరు నుంచి ముంబాయికి వస్తున్న విమానంలో ఓ మహిళపై తోటి ప్రయాణికుడు లైంగికంగా హింసించాడు. తరచూ విమానాలలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.