మహేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో అల్లరి నరేష్..!!!

SMTV Desk 2018-04-24 18:27:53  MAHESH BABU, ALLARI NARESH, VAMSHI PAIDIPALLI, POOJA HEGDE.

హైదరాబాద్, ఏప్రిల్ 24 : "భరత్ అనే నేను" చిత్ర౦ తర్వాత మహేష్ బాబు తన 25 వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే మహేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో హీరో అల్లరి నరేష్ నటించనున్నట్లు సమాచారం. మహేష్ బాబుతో పాటు పూర్తి స్థాయిలో అల్లరి నరేష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో కొత్తదనం ఉన్నందువల్లే నరేష్ ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడట. వచ్చే నెల నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనుంది. ఈ సినిమాకు సంబంధించిన వార్తలపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించవలసి ఉంది.