బాలుడిపై ఇరుదేశాల ప్రధానుల ఉద్వేగం

SMTV Desk 2017-07-06 12:43:00  Israeli Prime Minister Benjamin NetanyahuThe Jewish boy was Moses,Jerusalem, Terrorism, narendra modi

న్యూఢిల్లీ, జూలై 6 : భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడురోజుల పర్యటనలో భాగంగా, రెండో రోజైన బుధవారం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహుతో ఓ భావోద్వేగ భేటీకి వేదికయ్యారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో మృత్యుంజయుడైన యూదు బాలుడు మోషేని (11) ఆయన బుధవారం జెరూసలేంలో కలిశారు. ఆ బాలుడిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు. నువ్వు భారత్ కు ఎప్పుడైనా రావొచ్చు... అంటూ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అనంతరం మోది ఆ బాలుడిని ఐ లవ్ యూ అంటూ, ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఇరువురు నేతలు ఉగ్రవాదం వల్ల ఎదురవుతున్న సవాళ్లను, రక్షణ రంగంలో అందించుకోవాల్సిన సహకారంతో పాటు నీరు, వ్యవసాయం, అంతరిక్ష పరిజ్ఞానం, పశ్చిమాసియా అంశాల గురించి ప్రధానంగా చర్చించుకున్నారు. ఈ చర్చల తరువాత ఏడు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా నేతలిద్దరూ సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ కారణాలతోనూ ఉగ్రవాదాన్ని సమర్ధించలేమని ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని విభజించి చూడడం వల్ల దానిపై విజయం సాధించలేమని రెండు దేశాలు వెల్లడించాయి. ఈ రోజుతో ప్రధాని మోదీ మూడో రోజు పర్యటన కూడా ముగియనుంది.