మానవత్వం అణగారిపోయిన వేళ...

SMTV Desk 2017-07-06 12:27:45  gujarat, road accident,

గుజరాత్, జూలై 06 : ఈ రోజుల్లో మానవత్వం ఎంత అణగారిపోతుందో ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. ఓ తోపుడు బండి వ్యాపారిని రోడ్డు పై మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన వ్యాన్ ఢీకొట్టడంతో ఆ వ్యక్తి కింద పడిపోయాడు, కాని డ్రైవర్ మాత్రం తన వాహనాన్ని ఆపకుండా వెళ్ళిపోయాడు. షాక్ ని కలిగించే ఈ ఘటన గుజరాత్ లోని ఆనంద్ నగర్ లో జరిగింది. సీసీ టీవీలో హిట్ అండ్ రన్ దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో వ్యాపారికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక వచ్చిన వాహనం స్లో అవ్వడంతో అతడు ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ ఘటనపై ఆనంద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసారు. సీసీ టీవీ ఫూటేజ్ లో వాహనం నెంబరును గుర్తించామని, అతి త్వరలో డ్రైవరుని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.