ఐపీఎల్‌లో పృథ్వీ షా అరుదైన రికార్డు

SMTV Desk 2018-04-24 14:34:23  Prithvi Shaw, Prithvi Shaw delhi dare devils, ipl, rishib panth

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : ఐపీఎల్ లో ఈ ఏడాది అరంగేట్రం చేసిన భారత్‌ అండర్‌-19 జట్టు కెప్టెన్‌ పృథ్వీ షా అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరుపున పృథ్వీ షా గౌతమ్ గంభీర్ తో కలిసి ఓపెనర్‌గా దిగాడు. దీంతో ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కాడు. సోమవారం నాటికి పృథ్వీ షా వయసు 18 సంవత్సరాల 165 రోజులు. అంతకుముందు రిషబ్‌ పంత్‌ (18 ఏళ్ల 212 రోజులు) ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున 2017లో ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా 10 బంతుల్లో 22 పరుగులు చేశారు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.