విక్టరీ సినిమాలో అనసూయ..!!

SMTV Desk 2018-04-24 12:49:10  anasuya, anasuya in venkatesh movie, f2 movie, varun tej.

హైదరాబాద్, ఏప్రిల్ 24 : "రంగస్థలం" లో రంగమ్మత్తను ఎవరైనా మర్చిపోగలరా.? అంతలా తెరపై తన పాత్రను పండించింది బుల్లితెర నటి, యాంకర్ అనసూయ. తాజాగా మరో చిత్రంలో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్కనున్న మల్టీస్టారర్ "ఎఫ్ 2" మూవీలో అనసూయ నటించనుందని సమాచారం. అయితే ఈ చిత్రంలో ఒక కథానాయిక కోసం మెహ్రీన్ ను ఎంచుకోగా మరో కథానాయిక కోసం అన్వేషణ సాగుతోంది. ఈ చిత్ర౦లో అనసూయ ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.