బాల ఎన్టీఆర్ గా దేవాన్ష్‌..!!

SMTV Desk 2018-04-24 12:20:35  ntr biopic, balakrishna, ntr movie, ntr child charector devansh.

హైదరాబాద్, ఏప్రిల్ 24 : నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా "ఎన్టీఆర్" చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్న ఈ చిత్రబృందం నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో పడిపోయింది. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనుంది. అయితే బాల ఎన్టీఆర్ గా ఎవరు కనిపించనున్నారు.? అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే చిన్నప్పటి ఎన్టీఆర్ గా నారా లోకేష్‌ తనయుడు దేవాన్ష్‌ కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు యువ ఎన్టీఆర్ గా కల్యాణ్‌రామ్‌ వారసుడు శౌర్యారామ్ కనిపిస్తారని సమాచారం. అయితే యువ ఎన్టీఆర్ పాత్ర కోసం తొలుత మోక్షజ్ఞను ఎంపిక చేయాలని చిత్ర దర్శకుడు తేజ భావించినా, తన ఎంట్రీకి ఇంకా సమయం ఉందని బాలయ్య సున్నితంగానే తిరస్కరించినట్టు తెలుస్తోంది. మోక్షజ్ఞ ను హీరోగానే వెండి తెరకు పరిచయం చేయాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం. ఇక విషయాలన్నింటిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.