ముంబైతో మ్యాచ్ కు భువనేశ్వర్‌ దూరం..

SMTV Desk 2018-04-24 11:22:55  bhuvneshwar kumar, srh, ipl, mi

ముంబై, ఏప్రిల్ 24 : ఐపీఎల్ -11 సీజన్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కు వార్నర్ దూరమవ్వడం.. లీగ్ ప్రారంభమయ్యాక విలియంసన్ సారథ్యంలో జట్టు బాగానే రాణిస్తుంది. తాజాగా ఈ జట్టు ఆటగాళ్లకు గాయాల బెడద పట్టుకుంది. సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యూసుఫ్‌ పఠాన్‌ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. దీంతో ముంబయి ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కి ఎవరు దూరం అవుతారో, తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారో చూడాలి. ఇప్పటికే ఈ మ్యాచ్‌కి భువనేశ్వర్‌ కుమార్‌ దూరమైనట్లు ఆ జట్టు సారథి కేన్‌ విలియమ్సన్‌ వెల్లడించాడు. టోర్నీ ఆరంభంలో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ సీజన్‌లో రెండోసారి ముంబయి ఇండియన్స్‌తో తలపడుతున్న సన్‌రైజర్స్‌ మరోసారి విజయాన్ని దక్కించుకోవాలని భావిస్తుంది.