త్వరలోనే జట్టులోకి వస్తా : ధావన్‌

SMTV Desk 2018-04-23 17:23:50   Shikhar Dhawan, srh dhawan, ipl, hyderabad

హైదరాబాద్, ఏప్రిల్ 23 ‌: ఐపీఎల్ టోర్నీలో సన్ రైజర్స్ జట్టు కు లీగ్ ప్రారంభం కాక ముందే షాక్ తగిలింది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఆ జట్టు సారథి డేవిడ్ వార్నర్ వైదొలిగాడు. అయినప్పటికీ హైదరాబాద్ పగ్గాలు అందుకున్న కెన్ విలియం సన్ జట్టును విజయాల బాట పట్టిస్తున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ గాయపడ్డాడు. దీంతో ఆదివారం సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కి గబ్బర్‌ దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజాగా శిఖర్‌ ధావన్‌ ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ధావన్‌ కుమారుడు జరోవర్‌ కూడా కనిపించాడు. "గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న నా అభిమానులందరికీ ధన్యవాదాలు. గాయం నుంచి కోలుకునేందుకు చేయాల్సినవన్ని చేస్తున్నా. త్వరలోనే తిరిగి వస్తా" అని ధావన్ పేర్కొన్నాడు. పంజాబ్‌ ఆటగాడు బరీందర్‌ వేసిన షార్ట్‌ బాల్‌ ధావన్‌ ఎడమ చేతికి బలంగా తాకింది. దీంతో ఆ మ్యాచ్‌లో ధావన్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.