తండ్రీ కూతుళ్లు అనుకున్నా..!!

SMTV Desk 2018-04-23 16:42:30  actor milindh soman, ankitha marriage, milindh marriage comments.

హైదరాబాద్, ఏప్రిల్ 23 : ప్రముఖ నటుడు, మాజీ సూపర్‌ మోడల్‌ మిలింద్‌ సోమన్‌ పెళ్లిపై నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. మిలింద్ తన ప్రేయసి అంకితా కోన్వర్‌ను అలీబౌగ్‌లోని రిసార్ట్స్‌లో అంగరంగ వైభవంగా వివాహమాడారు. అంతేకాదు తమ పెళ్లి ఫోటోలను మిలింద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది దీంతో నెటిజన్లు తమకు ఇష్టమొచ్చిన రీతిలో దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఎందుకో తెలుసా.? మిలింద్ వయసు 52 అయితే అంకిత వయసు 27 మరి. అందుకే నెటిజన్లు ఈ విధంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ కామెంట్లకు స్పందించిన మిలింద్.. "మా పెళ్లి కొందరికి ఇది వింతగానే అనిపించొచ్చు" అని ట్వీట్ చేశారు. * ఇంతకీ నెటిజన్లు కామెంట్ చేసిన వాటిలో కొన్ని.. >> తండ్రీకూతుళ్లలా ఉన్నారు. >> మొదటిసారి వీరిద్దరినీ చూసినప్పుడు అతను పాపని దత్తత తీసుకున్నాడనుకున్నా. >> మిలింద్‌కి అంకితకు పెళ్లైంది. నేను ఒంటరిగా ఉంటూ చచ్చిపోయేలా ఉన్నాను. >> మిలింద్‌ సోమన్‌ పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మరోపక్క అంత పిన్న వయస్కురాలిని పెళ్లి చేసుకున్నందుకు మరో 658 ఏళ్లు ఏడవాలని ఉంది.