ఆ వార్తల్లో నిజం లేదు : చాహల్

SMTV Desk 2018-04-23 16:19:34  Yuzvendra Chahal, Actress Tanishka Kapoor, rcb, bengalore

బెంగళూరు,ఏప్రిల్ 23 : టీమిండియా యువ స్పిన్నర్‌ చాహల్‌ దక్షిణాది నటి తనిష్క కపూర్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై చాహల్‌ ట్విటర్‌ ద్వారా స్పందించాడు. తనిష్క కపూర్‌ తనకు స్నేహితురాలు మాత్రమేనని.. ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నాడు. తనిష్క కపూర్‌తో చాహల్‌ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు, త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. "ప్రతి ఒక్కరికీ హలో, నా పెళ్లి వార్తలకు సంబంధించి వస్తున్న వార్తలపై ఈ మెసేజ్‌ పెడుతున్నాను. తనిష్కతో నా పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ఆమె నా స్నేహితురాలు మాత్రమే. ఈ సందర్భంగా నేను మీడియా, అభిమానులను ఒకటే కోరుతున్నారు. ఈ వార్తలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి. మీరంతా నన్ను గౌరవిస్తారని అనుకుంటున్నా. నా పెళ్లిపై వస్తున్న వార్తలను ఇక పోస్టు చేయడం ఆపండి. ఇలాంటి వార్తలు పోస్టు చేసే ముందు ఒకసారి నిర్ధరించుకోవడం ఎంతైనా అవసరం. థాంక్యూ. లవ్‌ యూ ఆల్‌" అని చాహల్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.