అలెక్స్‌ హేల్స్‌ నోట.. బాలయ్య డైలాగ్

SMTV Desk 2018-04-23 15:32:06  alex hales, alex hales srh, ipl, balakrishna dialogue

హైదరాబాద్‌, ఏప్రిల్ 23 : ఐపీఎల్ అంటేనే అదో రకమైన హంగామా. వేసవిలో ఎక్కడలేని వినోదాన్ని అందిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 7న ఆరంభమైన ఈ మెగాటోర్నీ రసవత్తరంగా సాగుతుంది. దీంతో పాటు ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌ల్లో, తదితర కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌.. నందమూరి బాలకృష్ణ డైలాగు చెప్పి ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అలెక్స్‌ హేల్స్‌.. బాలకృష్ణ ప్రధాన ప్రాత్రలో నటించిన ‘శ్రీమన్నారాయణ’ సినిమాలోని ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ డైలాగ్‌ను అలవోకగా చెప్పేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. హేల్స్‌ చెప్పిన డైలాగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఫుల్ వైరల్ గా మారింది. బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన డేవిడ్ వార్నర్‌కు బదులు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అలెక్స్‌ హేల్స్‌ ను తీసుకున్నాడు.