టీ-20ల్లో అతను అత్యంత ప్రమాదకారి : యువీ

SMTV Desk 2018-04-23 12:55:57  yuvraj singh, chris gayle, ipl, kings x1 punjab

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: క్రిస్ గేల్ అంటేనే ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక సునామీ... అతను క్రీజులో ఉంటే ప్రత్యర్ధులకు చుక్కలు కన్పిస్తాయి. తన బ్యాటింగ్ తో పరుగులు తుఫాన్ సృష్టిస్తాడు. ఇప్పుడు అదే విషయాన్ని టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్‌ టీ20ల్లో తన సహచరుడు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ అత్యంత ప్రమాదకారి అని ఆయన పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్యంత విధ్వంసకర క్రికెటర్లలో క్రిస్ గేల్ ఒకడని, అతడు రాణించడంతో ఐపీఎల్ 11 సీజన్లో పంజాబ్ విజయాల బాట పట్టిందన్నాడు. తొలుత ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలని చూస్తున్నాం, ఒకవేళ ఫ్లే ఆఫ్స్ చేరితే కప్పు నెగ్గడమే తమ ముందున్న లక్ష్యమని యువరాజ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పటిష్ట జట్లు అని ఆ జట్టకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నాడు యువీ అభిప్రాయపడ్డాడు.