న్యాయదేవతకు మతచాందస ముసుగు

SMTV Desk 2017-05-27 14:40:30  law goddes,bangladesh,supreemcourt,isslam

బంగ్లాదేశ్, మే 25 : ఆంగ్లేయులు పరాయిదేశంలో.. బానిస దేశంలో అమలు చేసిన న్యాయ సూత్రాలు న్యాయ వ్యవస్థకే తలమానికం.. కళ్ళకు గంతలు కట్టుకున్న గ్రీకు దేవత థైమిన్ చేతిలో త్రాసుతో కక్షిదారులను, ప్రతివాదులకు సమన్యాయం చేస్తామనే ఉద్ఘాటన తేటతేల్లం అవుతుంది. ఆమెనే న్యాయదేవతగా ఆరాధిస్తాం. భారత దేశం నుండి విడివడిన పాకిస్థాన్,బంగ్లాదేశ్ లోను ఇదే రివాజుగా కొనసాగుతున్నది. అయితే ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మతఛాందస ధోరణి న్యాయదేవతను సైతం వదల్లేదు. బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రిం కోర్టు ముందు ఉన్న న్యాయదేవతను తొలగించాల్సి వచ్చింది. తూర్పు బెంగాల్ నుండి విడివడిన బంగ్లాదేశ్ వారికి ఆ విగ్రహం బెంగాలీ మహిళగా కన్పించడంతో పాటు, ఇస్లాం కు వ్యతిరేకంగా ఉందని, వారి మనోభావాలకు విఘాతం కలిగిస్తున్నదని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ విగ్రహాన్ని తొలగించి ప్రక్కనే ఉన్న మ్యూజియంకు తరలించారు. విగ్రహం తొలగింపు విషయమై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజా సంఘాలు, లౌకిక వాదులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఆందోళనకు దిగడంతో వారికి లాఠీలను రుచి చూపించారు.